కార్తీకమాస అభిషేకములు

పరమ పవిత్రమైన పాదగయాక్షేత్రములో కార్తీకమాస మహాపర్వదిన సంధర్బములో

ది.29-10-2019 మంగళవారం నుండి ది.26-11-2019 మంగళవారం వరకు

నెలరోజులు, ప్రతి నిత్యమూ ఉదయం 6 గం||ల నుండి భక్తుల గోత్రనామములతో స్వయంభూ:

లలింగమూర్తియైన శ్రీ రాజరాజేశ్వరీ సామెత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వార్కి

మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము జరుపబడును . ఆసక్తి గల భక్తులు కేవలం రూ.1000/- (వెయ్యి రూపాయలు) మాత్రం చెల్లించినచో వారి గోత్రనామములతో పై పూజలు జరిపి నిలచివర ఒకసారి పోస్టులో ప్రసాదం పంపబడును .అదే విధముగా కార్తీకమాసంలో ఒక సోమవారం రోజున అభిషేకమునకు (నంది మండపం వద్ద ) ఇద్దరు మాత్రమే పాల్గొనవచ్చును .

పాల్గొన్న భక్తులకు శేషవస్త్రములు , ప్రసాదములు ఇవ్వబడును . కావున భక్తులు ఈ అవకాశం సద్వినియోగము చేసుకొని శ్రీ రాజరాజేశ్వరీ సామెత శ్రీ ఉమా కుక్కుటేశ్వరస్వామి వారి కృపకు పాత్రులు కాగోరుచున్నాము